Bandi sanjay comments on BRS : పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనంతో బీజేపీ బలమేంటో అర్థమైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రధాని మోదీ కూడా పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా చేశారని తెలిపారు. పోలింగ్ బూత్ కమిటీల వల్లే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీకి మూల స్తంభం పోలింగ్ బూత్ స్థాయి కమిటీలేనని చెప్పారు.
రాజకీయాలు కాదు.. అభివృద్ధి గురించి మాట్లాడండి: బండి సంజయ్ - బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనంలో బండి సంజయ్
Bandi sanjay comments on BRS : కేసీఆర్ ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాజకీయాల గురించి కాదు.. అభివృద్ధి గురించి మాట్లాడమని బీఆర్ఎస్ నేతలకు సూచించారు. హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో పాల్గొన్నారు. పోలింగ్ బూత్‌ల వల్లే తమ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పోలీంగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం నిర్వహించింది. హైదరాబాద్‌లో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొని సరల్ యాప్‌ను ప్రారంభించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు.
"కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నారు. రాజకీయాల గురించి కాదు.. అభివృద్ధి గురించి మాట్లాడండి. రాష్ట్రంలో అన్ని వర్గాల వారి ప్రగతికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ సర్కార్.. మాటల్లో తప్ప చేతల్లో చూపించడం లేదు. రాష్ట్రానికి న్యాయం చేయని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరించడానికి బయల్దేరారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతో కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలతో అనుబంధం పూర్తిగా తెగిపోయింది. పోలింగ్ బూత్ కమిటీ సమ్మేళనంతో బీజేపీ బలమేంటో అర్థమైంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయే." - బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు