Mahajan Sampark Abhiyan programme In Telangana : విమర్శలు, ప్రతి విమర్శలకు తావు లేకుండా నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనపై తెలంగాణ ప్రజలకు, నాయకులకు వివరించేలా 'మహాజన్ సంపర్క్ అభియాన్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ కార్యక్రమం రేపటి నుంచి రాష్ట్రంలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.
- MLC Kavitha Bandi Sanjay Chitchat : ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్ మాటామంతీ
- Bandi Sanjay: 'ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. సర్వేలన్నీ మాకే అనుకూలం'
పాజిటివ్ దృక్పథంతో విమర్శలు, ప్రతి విమర్శలు లేకుండా ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా జూన్ 1నుంచి 7వ తేదీ వరకు మీడియా సమావేశాలు, కేంద్ర ప్రభుత్వ అభివృద్ది పనులను వివరించే కార్యక్రమాలు ఉంటాయన్నారు. జూన్ 8 నుంచి 14వతేదీ వరకు పార్టీకి దూరంగా ఉన్న సీనియర్ నాయకులతో సమ్మేళనాలు నిర్వహిస్తామన్నారు. జూన్ 15నుంచి 21 వరకు అసెంబ్లీ వారీగా భారీ బహిరంగ సభలు ఉంటాయన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ తొమ్మిది సంవత్సరాలలో సాధించిన విజయాలపై రూపొందించిన 'సేవా సుషాన్ గరీబ్ కల్యాణ్' వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.