ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ మన్యం పాడేరులో నేటి నుంచి రెండు రోజుల పాటు బంద్ కొనసాగుతోంది. గిరిజన ప్రాంతాల్లో చట్టాలు పటిష్టంగా అమలు చేయాలంటూ... జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నారు. రోడ్లపై ద్వి చక్రవాహనాలను, తోపుడు బళ్లను అడ్డుగా పెట్టి మరీ వాహనాలను నిలువరిస్తున్నారు. విశాఖపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు సైతం అడ్డుకుని కదలనివ్వలేదు. పర్యటకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ బంద్‌ను విజయవంతం చేయాలంటూ నిర్వహకులు కోరుతున్నారు.
గిరిపుత్రుల పోరుబాట... మన్యంలో రెండు రోజుల బంద్
గిరిజన ప్రాంతాల్లో చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ...ఐకాస ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజుల పాటు విశాఖ మన్యం పాడేరులో బంద్ నిర్వహిస్తున్నారు.
గిరిపుత్రుల పోరుబాట... మన్యంలో రెండు రోజుల బంద్