ఇటీవల శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన నగరవాసి వేమూరి తులసీరాం కుటుంబాన్ని భాజపా ఎంపీ, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పరామర్శించారు. శ్రీనగర్‌లోని మృతుడి ఇంటికి వెళ్లి ఆయన తల్లి, సోదరికి ధైర్యం చెప్పారు. ఉగ్రవాద సమస్యపై అన్నిదేశాలు కలిసి కట్టుకట్టుగా పోరాడాలని సూచించారు. రాష్ట్రంలో పలుచోట్ల ఉగ్రస్థావరాలు ఉండే అవకాశం ఉందని, ప్రభుత్వం ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
వేమూరితులసీరాం కుటుంబాన్ని పరామర్శించిన దత్తాత్రేయ - bjp mp
శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ వాసి వేమూరి తులసీరాం కుటుంబాన్ని మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పరామర్శించారు. మృతుడి తల్లి, సోదరికి ధైర్యం చెప్పారు.
bandaru-dattatreya-