తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2020, 10:32 PM IST

ETV Bharat / state

స్వామి అగ్నివేశ్​ జీవితం సమాజానికి అంకితం: దత్తాత్రేయ

ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్వామి అగ్వివేశ్​ మంచి నైతిక విలువలున్న వ్యక్తి అని.. ప్రత్యేకంగా ఆర్య సమాజ్​కు ఆయన మరణం తీరని లోటని అన్నారు. వారి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని బండారు దత్తాత్రేయ తెలియజేశారు.

bandaru-dattatreya-mourns-to-swamy-agnivesh
స్వామి అగ్నివేశ్​ మృతి పట్ల హిమాచల్​ గవర్నర్ బండారు సంతాపం

ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి మృతి తనకు చాలా బాధ కలిగించిందన్నారు. 1993 నుంచి తనకు స్వామి అగ్నవేశ్​తో అనుబంధముందని.. వాజ్​పేయి ప్రభుత్వంలో మంత్రిగా ప్రాతినిథ్యం వహించినప్పుడు పర్యావరణ సంబంధిత విషయాలపై తనను కలిసి వినతిపత్రాలు ఇచ్చేవారని గుర్తుచేసుకున్నారు.

తాను కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు వెట్టి చాకిరికి గురవుతున్న 'బంద్వ మజ్దూర్​' విషయంలో నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల పట్ల తనను కలిసి సంతోషం వ్యక్తం చేశారని దత్తాత్రేయ తెలియజేశారు. స్వామి అగ్నివేశ్ సమాజ కార్యకర్తగా తన జీవితాన్ని దేశం కోసం అర్పించారని... అఖిల భారత ఆర్య సమాజ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వారు నిస్వార్థ సేవలు అందించారని పేర్కొన్నారు. స్వామి అగ్వివేశ్​ మంచి నైతిక విలువలున్న వ్యక్తి అని.. ఆయన మరణం ప్రత్యేకంగా ఆర్య సమాజ్​కు తీరని లోటని అన్నారు. వారి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని బండారు దత్తాత్రేయ తెలియజేశారు.

ఇదీ చూడండి:కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి : కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details