తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలాపూర్​ లడ్డూ ధర@17.60 లక్షలు - Laddu auction

బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాటకు పాతికేళ్లుగా ప్రత్యేకత ఉంది. గతేడాది 16 లక్షల 60 వేల రూపాయలు పలికిన ధర... ఈసారి 17లక్షల 60 వేల రూపాయలకు చేరింది. కొలను రాంరెడ్డి కైవసం చేసుకున్నాడు. బాలాపూర్​ లడ్డుకోసం స్థానికులతో పాటు రైతులు, వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు ఈ వేలం పాటలో పోటీపడ్డారు.

బాలాపూర్​ లడ్డూ ధర@17.60 లక్షలు

By

Published : Sep 12, 2019, 10:35 AM IST

Updated : Sep 12, 2019, 1:19 PM IST

ఎంతో పేరున్న బాలాపూర్ గణేశుడి లడ్డూ ఈ సారి రికార్డు స్థాయి 17 లక్షల 60 వేల రూపాయల పలికింది. పోటాపోటీగా సాగిన వేలంలో కొలను రాంరెడ్డి కైవసం చేసుకున్నాడు. కొలను కుటుంబ సభ్యులు లడ్డూ గెలుచుకోవడం ఇది తొమ్మిదోసారి.

వేలంపాట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హాజరయ్యారు. గతేడాది 16 లక్షల 60 వేల రూపాయలు పలికింది. ఈ ఏడాది వేలం పాట కోసం 19 మంది పోటీపడ్డారు. ఆంధ్రప్రదేశ్​ నుంచి నెల్లూరు వాసి గుండాల వంశీకృష్ణారెడ్డి కూడా వేలంలో పాల్గొనడం విశేషం.

1994లో మొదలైన లడ్డూ వేలం పాట...
గ్రామాభివృద్ధి కోసం మొదలు పెట్టిన బాలాపూర్ లడ్డూ వేలం పాట.. లంబోదరుడి కటాక్షంతో నిర్విఘ్నంగా కొనసాగుతూ ఈ గ్రామ రూపురేఖలను మార్చివేసింది. మొదట 1994లో 450 రూపాయలతో వేలం పాట ప్రారంభమైంది. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15 లక్షల 60 వేలకు లడ్డూను అందుకున్నారు. గతేడాది స్థానికేతరుడైన తేరేటి శ్రీనివాస్ గుప్తా 16 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వందల, వేలు దాటి రికార్డు స్థాయికి చేరింది.బాగా కలిసి వస్తుండటమే కారణం. లడ్డూ దక్కించుకున్న వారి ఇంట సిరిసంపదలతో పాటు వ్యాపారం బాగా కలిసి వస్తుండటం వల్ల ప్రతి ఏటా తీవ్రమైన పోటీ నెలకొంటోంది.

బాలాపూర్​ లడ్డూ ధర@17.60 లక్షలు

ఇవీ చూడండి:గణేశుని నిమజ్జనం... భద్రతా వలయంలో భాగ్యనగరం

Last Updated : Sep 12, 2019, 1:19 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details