లాక్డౌన్ను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాలాపూర్, పహాడి షరీఫ్ పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. సాయంత్రం సమయంలో కూడా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇప్పటివరకు దాదాపు 150 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.
రాచకొండ పరిధిలో కఠిన నిబంధనలు అమలు - హైదరాబాద్ కరోనా వార్తలు
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో బాలాపూర్, పహాడి షరీఫ్ పోలీసులు కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 150 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.
రాచకొండ పరిధిలో సాయంత్రం కూడా కఠిన నిబంధనలు అమలు
అత్యవసర పరిస్థితుల్లో వస్తున్న వారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో తిరుగుతూ... ప్రజలను చైతన్యపరుస్తన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలను కోరుతున్నారు.
ఇదీ చూడండి: పోలీసుల లాఠీఛార్జ్.. ఫలితంగా మూడు గంటలు కరెంట్ కట్..!