బక్రీద్‌ను పర్వదినం జరుపుకునేందుకు సిద్ధమైన ముస్లింలు Bakrid Festival in Hyderabad : బక్రీద్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. పండుగ ప్రత్యేక ప్రార్ధనల కోసం ఈద్గాలు, మసీదుల్లో ఏర్పాట్లుచేశారు. బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సమష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగతస్వార్ధాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజహితం జరుగుతుందన్నారు. త్యాగాలద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమానంగా అందినప్పుడే.. ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందన్న సందేశాన్ని.. బక్రీద్ విశ్వమానవాళికి అందిస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.
KCR Wishes on Bakrid :త్యాగస్ఫూర్తికి, అత్యున్నత భక్తికి బక్రీద్ ప్రతీక అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ముస్లింలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సోదరభావం, సేవ, త్యాగం యొక్క స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇస్లాం విశ్వాసంలో బక్రీద్‌కు ప్రత్యేక స్థానం ఉందని తమిళిసై అన్నారు.
Bakrid Festival 2023 :బక్రీద్సందర్భంగా హైదరాబాద్‌లో.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. మీర్ ఆలం ఈద్గా వద్ద ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. ప్రార్ధనలకు.. సుమారు 30,000 మంది హజరయ్యే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే అన్నిశాఖల అధికారులతో.. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
"ఎక్కడైతే బక్రీద్పండుగ జరుపుకుంటున్నారో అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాం. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించాం. ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించనున్నాం." - సాయి చైతన్య, దక్షిణ మండల డీసీపీ
Bakrid Festival in Telangana :బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు మీర్ ఆలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్లిస్తున్నట్లు పోలీసులు వివరించారు. బహదూర్‌పురా క్రాస్ రోడ్ మీదుగా ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల మధ్య పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతించనున్నారు. జూపార్కు, మసీద్ అల్హా హో అక్బర్ ఎదురుగా వారి వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. మరోవైపు పశువులను తరలించే వాహనాల తనిఖీకి హైదరాబాద్ చుట్టుపక్కల.. 23 కమిషనరేట్ పరిధిలో 70 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
బక్రీద్ పండుగ పురస్కరించుకొని ప్రత్యేకించి హైదరాబాద్ పాతబస్తీలోపాటు పలు మార్కెటల్లో గొర్రెలు అమ్మకాలు జోరుగా సాగాయి. కొనుగోలు దారులతో మార్కెట్లు కిటకిటలాడాయి. గత ఏడాది 3 లక్షలకు పైగాజీవాలు అమ్ముడైతే.. ఈసారి జంట నగరాల్లో దాదాపు 5 లక్షల వరకు విక్రయాలు జరిగినట్లు అంచనా. అయితే గతం కంటే పెరిగిన ఖర్చులతో జీవాల ధరలు పెరిగాయని వ్యాపారులు తెలిపారు.
ఇవీ చదవండి: