ఆదివారం మొహర్రం పండుగ పేరుతో ఓ వర్గం వారు పెద్ద ఎత్తున రాష్ట్రమంతటా ర్యాలీ తీశారని భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి కొవిడ్-19 నియమ నిబంధనలు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఎక్కడ పోయాయని... ప్రభుత్వం ఎవరిపైనా.. ఎంత మంది పైన కేసులు పెడతారని మండిపడ్డారు.
'ప్రభుత్వానికి కొవిడ్ నిబంధనలు గుర్తుకు రాలేదా?' - భజరంగ్ దళ్
మొహర్రం సందర్భంగా ఓ వర్గం వారు రాష్ట్రమంతటా ర్యాలీ తీశారని... ప్రభుత్వానికి కొవిడ్-19 నియమ నిబంధనలు గుర్తుకు రాలేదా అని భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ ప్రశ్నించారు. వినాయక చవితి పండుగ నాడు ప్రభుత్వం మండపాలు వేయనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'ప్రభుత్వానికి కొవిడ్ నిబంధనలు గుర్తుకు రాలేదా?'
వినాయక చవితి పండుగ నాడు మండపాలు వేయనివ్వలేదని... విగ్రహాలను పెట్టడానికి అనుమతి ఇవ్వలేదని... పండుగ కాగానే నిమజ్జనం చేయాలని పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. నిమజ్జనానికి సక్రమంగా ఏర్పాట్లు చేయని రాష్ట్ర ప్రభుత్వం... హిందువులపై కక్ష్య సాధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో హిందువులు పోరాటానికి సిద్ధం కావాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇవీ చూడండి: పచ్చని పట్టణాలే లక్ష్యంగా.. 'గ్రీన్ స్పేస్ ఇండెక్స్'