పల్లవి ప్రశాంత్‌కు బెయిల్- కండీషన్స్ అప్లయ్ Bail to Bigg Boss Winner Pallavi Prashanth : బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్ పోలిస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత్ అభిమానులు, స్థానికులు గుమిగూడి ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలను ధ్వంసం చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. రెండ్రోజుల క్రితం పల్లవి ప్రశాంత్(Pallavi Prasanth Bail)తో పాటు తన సోదరుడు సహా మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు, చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. వీరందరికీ నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు ఛార్జీషీట్ కోర్టులో దాఖలు చేసే వరకు ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
Bigg Boss 7 Winner Pallavi Prasant Case Update :రూ.15 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని కోర్టు తెలిపింది. దీంతో నేడు పూచీకత్తులు సమర్పించి ప్రశాంత్ జైలు నుంచి విడుదల కానున్నారు. మరోవైపు బిగ్‌బాస్ విజేత(Bigg Boss 7 Winner) పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు వెనుక ఎటువంటి తప్పిదం లేదని పశ్చిమ మండలం డీసీపీ విజయ్‌కుమార్ తెలిపారు.
బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు
"మేము పోలీస్ చట్టం దృష్ట్యా చూశాం. చట్టం ముందు అందరూ సమానులే. రైతుబిడ్డ కాదో అవునో అనేది పోలీసులకు సంబంధించినది కాదు. మొదటి ఎఫ్ఐఆర్లో పోలీసులు ఇస్తున్న సూచనలను ఉల్లఘించి పల్లవి ప్రశాంత్ అభిమానులు కార్యకలాపాలకు పాల్పడ్డారు. రెండో ఎఫ్ఐఆర్లో బిగ్‌బాస్ గెలిచిన వ్యక్తి, ఆయన సోదరుడు వాళ్లిద్దరూ పోలీసుల ఆదేశాలను పాటించలేదు. దీంతో వారి మీద కేసు నమోదు చేశాం. ఈ కేసులో ఇంకా ఎవరైతే ఉన్నారో వారందరి మీదా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం."- విజయ్‌కుమార్, పశ్చిమ మండలం డీసీపీ
పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మంది అరెస్టు
Nampally Court Give Conditional Bail to Pallavai Prasanth: విజేతగా ప్రకటించాక పల్లవి ప్రశాంత్‌ను ఊరేగింపుగా వెళ్లొద్దని సూచించామని పోలీసులు తెలిపారు. బయట అభిమానులు గుంపుగా ఉండటంతో వెనక మార్గం గుండా పంపామని చెప్పారు. తర్వాత ఊరేగింపుగా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు(Pallavi Prasanth Case Update) చేయడంతో గొడవలు జరిగాయని స్పష్టం చేశారు. అతడితో సహా 16 మందిపై కేసులు నమోదు చేశామని డీసీపీ తెలిపారు. బిగ్‌బాస్ నిర్వాహకులకు కూడా త్వరలో నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు.
ఇదేం అభిమానం - బిగ్‌బాస్ ఫ్యాన్స్‌పై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్