తెలంగాణ

telangana

ETV Bharat / state

Bail Kummara First Phd: బైల్‌కమ్మర కులానికి చెందిన మహిళకు పీహెచ్​డీ పట్టా - Telangana news

Bail Kummara First Phd: దక్షిణ భారతదేశంలో సంచార జాతి బైల్‌కమ్మర కులానికి చెందిన బీకే రాజ్యలక్ష్మి తొలి పీహెచ్​డీ పట్టా పొందిన మహిళగా నిలిచిందని రాష్ట్రసాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.

Rajalaxmi
Rajalaxmi

By

Published : Mar 16, 2022, 5:20 AM IST

Bail Kummara First Phd: దక్షిణ భారతదేశంలో సంచార జాతి బైల్‌కమ్మర కులానికి చెందిన బీకే రాజ్యలక్ష్మి తొలి పీహెచ్​డీ పట్టా పొందిన మహిళగా నిలిచిందని రాష్ట్రసాహిత్య అకాడమి ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. సాహిత్య అకాడమి కార్యాలయంలో ఛైర్మన్‌ను కలిసి పీహెచ్​డీ పట్టా పొందిన విషయాన్ని.. రాజ్యలక్ష్మి తెలియజేశారు. బైల్ కమ్మర కులానికి చెందిన డాక్టర్ రాజ్యలక్ష్మి సాఫ్ట్ స్కిల్స్‌పై... పీహెచ్​డీ పూర్తిచేయటం హర్షించదగిన విషయమని గౌరీశంకర్‌ పేర్కొన్నారు. బైల్ కమ్మరులను బీసీ జాబితాలో చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించినందున రాజ్యలక్ష్మికి ఉద్యోగం పొందే అర్హతను సాధించిందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details