Bail Granted to TDP Leaders: ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఇద్దరు తెలుగుదేశం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఉన్న కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు నుంచి వచ్చిన పోలీసులు బలవంతంగా నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నట్లు ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు.
కందుకూరు ఘటన.. టీడీపీ నేతలు అరెస్టు.. బెయిల్‌పై విడుదల - nellore incident
Bail Granted to TDP Leaders: ఏపీలోని కందుకూరులో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఇద్దరు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావుతో పాటు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం వారిని జడ్జి ఎదుట హాజరు పరచగా.. వారికి కందుకూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు పెట్టిన సెక్షన్లు వర్తించవని న్యాయమూర్తి తెలిపారు.
TDP Leader
ఆయనతో పాటు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేశ్‌ను జూబ్లీహిల్స్‌లో అదుపులోకి తీసుకున్నారు. వైద్యపరీక్షల అనంతరం వీరిద్దరినీ జడ్జి ఎదుట హాజరుపరిచారు. వారికి కందుకూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు పెట్టిన ఎస్సీ, ఎస్టీ సెక్షన్లు వర్తించవని న్యాయమూర్తి తెలిపారు.
ఇవీ చదవండి: