హైదరాబాద్ నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో కన్న బిడ్డను పోషించలేక అమ్ముకున్న ఉదంతం వెలుగుచూసింది. నాచారానికి చెందిన మీనా, వెంకటేశ్ దంపతులు ఓ మధ్యవర్తి ద్వారా జూలై 19న కాప్రాకు చెందిన సూపర్వైజర్ రాజేశ్‌కు మగబిడ్డను విక్రయించారు.
బిడ్డను అమ్మిన ఐదు నెలలకు వెలుగులోకి... - హైదరాబాద్ తాజా సమాచారం
హైదరాబాద్ నాచారానికి చెందిన దంపతులు కన్నబిడ్డను పోషించలేక అమ్ముకున్నారు. ఐదు నెలలు గడిచాక తనబిడ్డ కావాలంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బిడ్డను అమ్మిన ఐదు నెలలకు వెలుగులోకి...
ఈఎస్ఐ ఆస్పత్రిలో తన భార్య పేరిట రాజేశ్ ప్రసవం చేయించారు. ఐదు నెలల తరువాత తన బిడ్డను తనకు ఇవ్వాలని అసలు తల్లి మీనా పోలీసులను ఆశ్రయించింది. తనకు ఆడబిడ్డ పుట్టిందని చెప్పి మధ్యవర్తి మోసం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు అప్పగించారు.