హైదరాబాద్ మలక్‌పేటలోని నల్గొండ చౌరస్తాలో అంబులెన్స్‌లో ఓ గర్భిణీ మగబిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రవి, గౌరి దంపతులు బడంగ్‌పేటలో నివాసముంటోంది. గౌరికి నెలలు నిండగా... పురిటి నొప్పులు వచ్చాయి. ఆలస్యం అవుతోందని క్యాబ్‌లో ఆస్పత్రికి బయలుదేరారు. సంతోష్‌నగర్ కూడలిలో 108 అంబులెన్స్ సిబ్బంది గర్భిణీని ఎక్కించుకున్నారు. పేట్ల బురుజు ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో మార్గంలో తీవ్రంగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. ఆలస్యం కావటం వల్ల మధ్యలోనే గౌరి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను అంబులెన్స్ సిబ్బంది ఆస్పత్రిలో చేర్పించగా... ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ట్రాఫిక్ జామ్ కారణంగా అంబులెన్స్‌లోనే బిడ్డకు ప్రసవం... - DELIVARY IN TRAFFIC
కొన్ని సినిమాల్లో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీ... ట్రాఫిక్‌లో ఇరుక్కుంటుంది. దగ్గర్లో ఆస్పత్రి లేదు. పరిస్థితి చేజారిపోతున్న సమయంలో హీరోనో... హీరోయినో వచ్చి పురుడు పోస్తుంది. అచ్చం ఇలాంటి సన్నివేశమే చోటుచేసుకుంది హైదరాబాద్‌లో...! పురిటి నొప్పులతో ఆస్పత్రికి బయలుదేరిన ఓ గర్భిణీ... ట్రాఫిక్ కారణంగా అంబులెన్స్‌లోనే తన బిడ్డకు జన్మనిచ్చింది.
BABY DELIVERY IN TRAFFIC JAM IN HYDERABAD MALAKPET