Ayodhya Ram Mandir Opening 2024 :అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2,500 ఏళ్లు తట్టుకుని నిలబడేలా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నాగర శైలిలో, అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ టింబర్ కంపెనీ ఆలయ నిర్మాణంలో పాలుపంచుకుంటోంది.
Ayodhya Temple Doors Making in Hyderabad :అయోధ్య రామమందిరం కోసం వినియోగించనున్న తలుపులను హైదరాబాద్‌లో తయారు చేస్తున్నారు. సికింద్రాబాద్ న్యూబోయిన్‌పల్లిలోని అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్‌లో వీటిని రూపొందిస్తున్నారు. ఇందుకోసం నిపుణులైన కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. చూడముచ్చటైన శిల్పాలతో చెక్కిన తలుపులను రూపొందిస్తున్నారు.
అయోధ్య రామయ్యకు 5వేల డైమండ్స్‌తో నెక్లెస్- వజ్రాల వ్యాపారి అరుదైన కానుక!
అయోధ్యలోని రామమందిరం కోసం, ఆలయ ప్రాంగణానికి అవసరమైన 100కు పైగా తలుపులను తాము తయారు చేస్తున్నామని సంస్థ యజమాని శరత్‌బాబు తెలిపారు. బల్లార్షా నుంచి తెచ్చిన టేకునే వాడుతున్నామన్నారు. అందులో కూడా అధిక నాణ్యత కలిగిన కలపను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. రామమందిరం ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడటంతో పనిలో వేగం పెంచామని చెప్పారు. ఈ అవకాశం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నామని యజమాని శరత్ బాబు పేర్కొన్నారు.
బంగారు పూతతో అయోధ్య ఆలయం- వెండి నాణేలపై రామ దర్బార్- గిఫ్ట్స్ సూపర్!