తెలంగాణ

telangana

ETV Bharat / state

RACHAKONDA CP: 'డ్రగ్స్ వినియోగదారులు, రవాణాదారులపై కఠిన చర్యలు అమలు చేయాలి'

Rachakonda CP Mahesh Bhagawat: డ్రగ్స్ వినియోగదారులు, రవాణాదారులపై నిశితంగా నిఘా ఉంచి కఠిన చర్యలు అమలు చేయాలని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ పోలీసులకు సూచించారు. ఎల్బీనగర్​లోని ఓ గార్డెన్​లో నార్కోటిక్ డ్రగ్స్​పై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు ఎన్డీపీఎస్ చట్టంపై అవగాహన సదస్సుకు ఆయన హాజరై ప్రసంగించారు.

RACHAKONDA CP: 'డ్రగ్స్ వినియోగదారులు, రవాణాదారులపై కఠిన చర్యలు అమలు చేయాలి'
RACHAKONDA CP: 'డ్రగ్స్ వినియోగదారులు, రవాణాదారులపై కఠిన చర్యలు అమలు చేయాలి'

By

Published : Dec 11, 2021, 9:33 PM IST

Rachakonda CP Mahesh Bhagawat: హైదరాబాద్ ఎల్బీనగర్​లోని ఓ గార్డెన్​లో నార్కోటిక్ డ్రగ్స్​పై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసులకు ఎన్డీపీఎస్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్, డైరెక్టరేట్ రెవిన్యూ ఇంటెలిజెన్స్ నుంచి ఎ.రంగనాథం, ఎల్బీనగర్ ఎంఎస్​కే కోర్టు అడిషనల్ పీపీ రాజిరెడ్డి హాజరయ్యారు. మాదకద్రవ్యాల నివారణ కోసం రాచకొండ పోలీసులు సెమినార్ నిర్వహించి అవగాహన కల్పించారు. నార్కోటిక్ డ్రగ్స్‌పై జరిగిన ఈ సదస్సులో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఎస్‌హెచ్‌ఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్డీపీఎస్​ చట్టంలోని వివిధ సెక్షన్లపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ప్రసంగించారు.

డ్రగ్స్ వినియోగం, చిన్న పరిమాణం, వాణిజ్య పరిమాణం, డ్రగ్స్ వ్యాపారంలో నిందితుల ఆర్థిక సహాయం, నిందితులకు శిక్షల గురించి సీపీ ఈ సదస్సులో వివరించారు. పోలీసులు ఎన్డీపీఎస్​ చట్టం నిబంధనలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహించాలని అన్నారు. డ్రగ్స్ వినియోగదారులు, రవాణాదారులపై నిశితంగా నిఘా ఉంచి కఠిన చర్యలు అమలు చేయాలన్నారు. జీరో టోలరెన్స్‌ని నిర్ధారించి, డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details