రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అవార్డు - Rajiv Gandhi International Airport
14:08 August 09
ఉత్తమ విమానాశ్రయంగా రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్
మధ్య ఆసియాలో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. ఈ అవార్డును వరుసగా మూడో ఏడాది కూడా దక్కించుకున్నట్లు జీఎంఆర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. 2021 స్కైట్రాక్స్ వరల్ట్ ఎయిర్ పోర్టు అవార్డుల కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకుంది.
ప్రపంచ టాప్ 100 విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ విమానాశ్రయం 64వ స్థానానికి ఎగబాకినట్లు జీఎంఆర్ ప్రకటించింది. 2020లో ఈ జాబితాలో 71వ స్థానంలో ఉండగా... ఈ ఏడాది 64వ స్థానానికి చేరింది. శుభ్రత విషయంలో 3వ స్థానం, ఎయిర్ పోర్టు సిబ్బంది విషయంలో 4వ ర్యాంకు, ఆసియాలోని ఉత్తమ విమానాశ్రయాల్లో 6వ స్థానంలో నిలిచినట్లు జీఎంఆర్ తెలిపింది. జీఎంఆర్ నిర్వహిస్తోన్న దిల్లీలోని ఎయిర్ పోర్టు.... వరుసగా మూడో సంవత్సరం భారత్, మధ్య ఆసియాలో ఉత్తమ విమానాశ్రయంగా నిలిచిందని ప్రకటించింది.
ఇదీ చదవండి:కోయంబత్తూర్ టెక్నాలజీ సాయం.. ఎట్టకేలకు అంతయ్య మృతదేహం లభ్యం