సివిల్ ఎయిర్‌క్రాప్ట్ లీజింగ్, అసెట్ మేనేజ్‌మెంట్ సేవల కోసం హైదరాబాద్‌కు చెందిన అవెరెక్సీ సంస్థ, ఐర్లాండ్‌కు చెందిన సెలోమ్ ఏవియేషన్ ఉమ్మడి భాగస్వామ్యంతో పని చేయనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్‌లోని మెర్క్యురీ హోటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒప్పంద పత్రాలపై రెండు సంస్థలకు చెందిన డైరెక్టర్లు సంతకాలు చేశారు. కొత్త సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయడం ద్వారా... ఎయిర్‌లైన్ ఆపరేటర్లు, ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీలకు ప్రొడక్ట్ సొల్యూషన్, మేనేజ్‌డ్ సర్వీస్‌లను మరింత సులువుగా అందించే అవకాశం ఉంటుందని అవెరెక్సీ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మనీష్‌సింగ్, సెలోమ్ ఏవియేషన్ లిమిటెడ్ డైరెక్టర్ రవిరెడ్డి తెలిపారు. అవెరెక్సీ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భాగ్యస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని సెలోమ్ ఏవియేషన్ డైరెక్టర్ రవిరెడ్డి అన్నారు. ఇలా ఉమ్మడి భాగస్వామ్యం ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు.
ఒప్పందం చేసుకున్న అవెరెక్సీ, సెలోమ్ ఏవియేషన్ - business
హైదరాబాద్‌కు చెందిన అవెరెక్సీ సంస్థ, ఐర్లాండ్‌కు చెందిన సెలోమ్ ఏవియేషన్ ఉమ్మడి భాగస్వామ్యంతో పని చేయనున్నాయి. సివిల్ ఎయిర్‌క్రాప్ట్ లీజింగ్, అసెట్ మేనేజ్‌మెంట్ సేవల కోసం ఒప్పంద పత్రాలపై రెండు సంస్థలకు చెందిన డైరెక్టర్లు సంతకాలు చేశారు.
ఒప్పందం చేసుకున్న అవెరెక్సీ, సెలోమ్ ఏవియేషన్