కేంద్రం పెంచిన ట్రాఫిక్ జరిమానాలను అమలు చేయొద్దని ఆటో డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు ధర్నా నిర్వహించారు. కేంద్రం పెంచిన చాలన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకూడదని యూనియన్ నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు. ప్రభుత్వం పున సమీక్షించి ఈ విధానానికి స్వస్తి పలకాలని కోరారు. పెరిగిన ఇన్సూరెన్సు ధరలను తగ్గించాలని, ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్ల సంక్షేమానికి ఏటా 10 వేల రూపాయలు ఇస్తున్నారని, తెలంగాణలో డ్రైవర్లకు కూడా 10 వేలు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.
పెంచిన ట్రాఫిక్ జరిమానాలను రద్దు చేయాలి - రద్దు
కేంద్రం పెంచిన ట్రాఫిక్ జరిమానాలను వెంటనే రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. రోజు రోజుకు తమ జీవన పరిస్థితి దుర్భరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెంచిన ట్రాఫిక్ జరిమానాలను రద్దు చేయాలి