పన్ను దారులు ఈ నెలాఖరు లోపు పన్ను చెల్లింపులకు సంబంధించి రిటర్న్‌లు దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శంకరన్ తెలిపారు.అలా చేయని పక్షంలో శాఖా పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జులైతోనే గడువు ముగిసినప్పటికీ... కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నెల రోజుల పాటు సమయాన్ని పొడిగించినట్లు వివరించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల నుంచి రూ.50,040 కోట్లు పన్నులు వసూలైనట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరానికి రూ.70,573 కోట్లు పన్నులు వసూలు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
'ఆగస్టు 31లోపు పన్ను చెల్లింపుల రిటర్న్‌లు దాఖలు చేయాలి' - పన్ను రిటర్న్ దాఖలు గడవు ఆగస్టు 31
తెలుగు రాష్ట్రాల్లో పన్ను దారులు ఈ నెలాఖరులోపు రిటర్న్‌లు దాఖలు చేయాలని ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శంకరన్ తెలిపారు. వీటికి జులైతోనే గడువు ముగిసినప్పటికీ... కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నెల రోజుల పాటు సమయాన్ని పొడిగించినట్లు వివరించారు. సకాలంలో రిటర్న్ దాఖలు చేయకుంటే శాఖా పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఐటీ రిటర్న్