హైదరాబాద్ అసిఫ్‌నగర్‌లోని కిషన్‌నగర్ కాలనీలో కిడ్నాప్ ఉదంతం చోటుచేసుకుంది. స్థానికంగా కూలిగా పనిచేసే సలీం ఇద్దరు బాలికలను పండ్లు కొనిస్తానంటూ తీసుకుపోతుండగా గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకున్నారు. ప్రశ్నించిన స్థానికులకు సలీం పొంతన లేని సమాధానం చెప్పడంతో దేహశుద్ధి చేసి ఆసిఫ్ నగర్ పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు హుటాహుటిన పోలీస్టేషన్‌కు చేరుకున్నారు. అతనిని ఎప్పుడూ ఈ ప్రాతంలో చూడలేదని వెల్లడించారు.
పండ్లు కొనిస్తానని తీసుకుపోతుంటే పట్టుకున్న స్థానికులు - అడ్డుకున్నారు
కూలిగా పనిచేసే ఓ వ్యక్తి ఇద్దరు బాలికలకు మాయ మాటలు చెప్పి తీసుకెళ్తుండగా గమనించిన స్థానికులు అతన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
పండ్లు కొనిస్తానంటూ తీసుకుపోతుండగా పట్టుకున్న స్థానికులు