హైదరాబాద్ కంచన్‌బాగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హఫీజ్‌బాబానగర్‌లో 18 వందల రూపాయల విషయంలో చెలరేగిన గొడవ కత్తుల దాడికి దారితీసింది. మోషిన్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి యూనస్, అర్షద్‌లపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
రూ.1800 కోసం కత్తులతో దాడి
హైదరాబాద్ హఫీజ్‌బాబానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. 18 వందల రూపాయల విషయంలో చెలరేగిన గొడవ కత్తుల దాడికి దారితీసింది.
హఫీజ్‌బాబానగర్‌లో స్నేహితునిపై కత్తితో దాడి
ఈ దాడిలో అర్షద్ తీవ్రంగా గాయపడగా..యూనస్‌కు స్పల్ప గాయాలయ్యాయి. గొడవను ఆపేందుకు వెళ్ళిన మరోవ్యక్తి కూడా గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఆర్షద్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.