తెలంగాణ

telangana

ETV Bharat / state

కాశీలో అంగరంగ వైభవంగా అతిరుద్రయాగం

మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో కాశీలో వైభవంగా అతిరుద్ర యాగం ఎనిమిదో రోజు కొనసాగింది. 119మంది వేద రిత్విక్​లతో 1119సార్లు శివుడికి క్షీరాభిషేకం చేశారు. భక్తులు వేల సంఖ్యలో పాల్గొనడం వల్ల కాశీ పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది.

కాశీలో అంగరంగ వైభవంగా అతిరుద్రయాగం

By

Published : Nov 21, 2019, 11:40 PM IST

ఎనిమిదో రోజు అతిరుద్ర యాగంలో భాగంగా గురువారం కాశీలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఉదయం వేకువజామునే కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం రుద్ర హోమం జరిగే మండపానికి విచ్చేసి కాలభైరవ అష్టకంతో అతిరుద్ర యాగాన్ని ప్రారంభించారు. శివుడికి క్షీరాభిషేకం చేస్తూ 1119 సార్లు 119 వేద రిత్విక్​లతో రుద్ర పారాయణ చేస్తూ అభిషేకం చేశారు. అన్నపూర్ణ దేవి, సరస్వతీదేవికి అర్చన చేసి మహా మంగళ హరతిని ఇచ్చారు.

ఈ మహా యజ్ఞంలో మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అలాగే ఈ నెల 24న మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి ఈ అతిరుద్ర యాగానికి మహా పూర్ణాహుతి జరుగుతుందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలియజేశారు. ఈ కార్యక్రమంతో ఈ యాగం పరిసమాప్తం కానుంది.

కాశీలో అంగరంగ వైభవంగా అతిరుద్రయాగం

ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు

ABOUT THE AUTHOR

...view details