తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 2 లక్షల 86వేల కోట్ల అప్పు

ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రాష్ట్ర అప్పు రూ. రెండు లక్షలా 86వేల కోట్లకు చేరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. రెండు లక్షలా 45వేల కోట్ల రుణం ఉండనుండగా రానున్న ఏడాది మరో రూ. 47వేల కోట్ల అప్పును ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ సంస్థలు తీసుకున్న రుణాలు మరో రూ. లక్ష కోట్లకు పైనే ఉన్నాయి.

ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 2 లక్షల 86వేల కోట్ల అప్పు
ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 2 లక్షల 86వేల కోట్ల అప్పు

By

Published : Mar 19, 2021, 5:29 AM IST

ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి రూ. 2 లక్షల 86వేల కోట్ల అప్పు

2021-22 ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 47,500 కోట్లను రుణాల ద్వారా సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రుణపరిమితిని 3 నుంచి నాలుగు శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్ర జీఎస్​డీపీలో ప్రస్తుత ఏడాది స్వల్పపెరుగుదల ఉందని వచ్చే ఏడాది మరింత ఆశాజనకంగా ఉంటుందని... ప్రభుత్వం అంచనా వేసింది.

రూ. 47,500 కోట్ల రుణాలు...

జీఎస్​డీపీలో పెరుగుదలతో పాటు రుణపరిమితి పెంచినందున రూ. 47,500 కోట్ల రుణాలను సర్కారు ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 34 వేల కోట్ల రుణాలు ప్రతిపాదించగా అంచనాలకు మించి రూ. 43,784 కోట్లు అప్పుగా తీసుకున్నారు. కరోనాతో ఆదాయం భారీగా పడిపోవడంతో ఎక్కువగా అప్పులపై ఆధారపడాల్సి వచ్చింది. కేంద్రం సైతం ఎఫ్​ఆర్​బీఎం 5 శాతం వరకు రుణాలకు అనుమతివ్వడంతో అదనంగా అప్పులు తీసుకునే వెసులుబాటు కలిగింది.

అప్పులు 21.32 శాతం...

2019-20లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 37వేల 109 కోట్లను రుణంగా తీసుకుంది. 2018-19 లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పులు రూ. లక్షా 75వేల 281.07 కోట్లు ఉండగా జీఎస్​డీపీ అప్పుల శాతం 20.25గా ఉంది. 2019-20 లెక్కల ప్రకారం రాష్ట్రరుణాలు రూ. రెండు లక్షలా 5వేల 858.33 కోట్లు అంటే జీఎస్​డీపీలో అప్పులు 21.32 శాతంగా ఉంది.

రెండు లక్షల కోట్లు దాటిన అప్పులు...

సవరించిన అంచనాల ప్రకారం 2020-21 నాటికి రాష్ట్ర మొత్తం అప్పులు రూ. రెండు లక్షల 45వేల282.19 కోట్లు అంటే జీఎస్​డీపీలో అప్పులు ఏకంగా 25.07శాతానికి పెరిగింది. కరోనా వల్ల అదనపు అప్పులతో ఆ మొత్తం భారీగా పెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ. 47వేల 500 రుణాలు తీసుకోనుండటంతో మొత్తం అప్పులు రూ. రెండు లక్షలా 86వేల 804.64 కోట్లకు చేరనుంది.

జీఎస్​డీపీలో అప్పుల శాతం 24.84గా అంచనా వేశారు. రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తుతో వివిధ కార్పొరేషన్లు, సంస్థలు తీసుకున్న రుణాలు వాటికి అదనం. 2021 మార్చినాటికి ఈ తరహా రుణాల మొత్తం రూ. లక్షా 5వేల 6.71కోట్లుగా ఉంది. ఇందులో రిస్క్ వెయిట్ ఉన్న రుణాల మొత్తం రూ. 32వేల 561 కోట్లు. అందులో సాగునీటి రంగానికి సంబంధించిన రుణాలు రూ. 14,562 కోట్లు కాగా మిషన్ భగీరథ రుణాలు రూ. 12,503కోట్లు. ఇతర అప్పులు రూ. 5,495.78 కోట్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: తెలంగాణ బడ్జెట్​ రూ.2,30,825 కోట్లు

ABOUT THE AUTHOR

...view details