కార్మికసంఘాలతో చర్చలపై ఆర్టీసీ యాజమాన్యం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. తెలంగాణ మజ్దూర్ యునియన్ ఆవిర్భావించి ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని యూనియన్ కార్యాలయంలో ఆయన జెండా ఆవిష్కరించారు. చర్చల నుంచి తాము వెళ్లిపోలేదని... ఐఏఎస్‌లే బాయ్‌కాట్ చేశారని వివరించారు. ఎప్పుడు చర్చలకు పిలిచినా తాము సిద్ధంగా ఉన్నామని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.
"చర్చలకు ఎప్పుడు పిలిచినా మేము సిద్ధం" - తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో తాము మధ్యలో వెళ్లిపోలేదని.. ప్రజలకు ఐఏఎస్ అధికారులు అవాస్తవాలు చెప్పారని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.
ఐఏఎస్ అధికారులు అబద్ధాలు చెప్పవద్దు: అశ్వత్థామరెడ్డి
TAGGED:
aswaddama addressing press