తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓయూలో పది రోజుల పాటు ఆస్ట్రానమీ తరగతులు - ఓయూలో పది రోజుల పాటు ఆస్ట్రానమీ తరగతులు

నక్షత్రాల గురించి తెలుసుకోవాలని ఉందా..? కాల గమనం గురించి పరిశీలించాలని ఉందా..? ఇలాంటి ఎన్నో అంశాలను వివరిస్తూ ఆస్ట్రానమీపై పూర్తి అవగాహన కల్పించేందుకు ఓయూలో ఓ సర్టిఫికెట్ కోర్సు నిర్వహిస్తున్నారు.

ఓయూలో పది రోజుల పాటు ఆస్ట్రానమీ తరగతులు

By

Published : Jul 9, 2019, 5:09 AM IST

Updated : Jul 9, 2019, 6:46 AM IST

ఆస్ట్రానమీపై పూర్తి అవగాహన కోసం పదిరోజుల సర్టిఫికెట్ కోర్సు ఓయూలోని ఆస్ట్రానమీ విభాగంలో ప్రారంభించారు. ఈ కోర్సులో చేరేందుకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. జులై ఎనిమిది నుంచి 19 వరకు తరగతులు జరగనున్నాయి. కేవలం ఇంటర్​లో సైన్స్​ గ్రూపు చదివిన విద్యార్థులతో పాటు ఏ గ్రూపు చదివిన విద్యార్థులైనా ఆస్ట్రానమీపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ పది రోజుల కోర్సు ఎంతో ఉపయోగపడుతోందని ఓయూ ఆస్ట్రానమీ విభాగాధిపతి శాంతిప్రియ తెలిపారు. ఏటా మే నెలలో నోటిఫికేషన్​ విడుదలవుతుందని జులైలో తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. కేవలం మూడువేల రూపాయలు రిజిస్ట్రేషన్​ చార్జీలు చెల్లించి ఈ కోర్సులో చేరవచ్చని తెలిపారు. కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్​ అందజేస్తామన్నారు.

ఓయూలో పది రోజుల పాటు ఆస్ట్రానమీ తరగతులు
Last Updated : Jul 9, 2019, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details