అక్రమాలకు అడ్డుకట్ట...
మన ప్రజాపంపిణీ విధానంపై అసోం మంత్రి ప్రశంసల జల్లు... - ASSAM IT MINISTER KESHAB MAHANTA VISITED TELANGANA
తెలంగాణలో ప్రజా పంపిణీ విధానం చాలా బాగుందని... ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని అసోం మంత్రి కేశబ్ మహంత ప్రశంసల జల్లు కురింపించారు. సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ... ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేసిందని మంత్రి పేర్కొన్నారు.
కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్, సరుకుల రవాణా వాహనాల జీపీఎస్ ట్రాకింగ్ విధానం, ఈ-పాస్ మిషన్ పనితీరు, ఐరిస్ విధానాన్ని కేశబ్ మహంత పరిశీలించారు. ముఖ్యంగా రేషన్ బియ్యం తరలించే వాహనాలు పక్కదారి పట్టకుండా... వాటి కదలికలు ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా పర్యవేక్షించేలా పౌరసరఫరాల భవన్‌లో ఏర్పాటైన కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు అద్భుతంగా ఉందని మంత్రి కేశబ్ మహంత ప్రశంసించారు. ప్రజా పంపిణీ సరుకుల్లో అక్రమాలకు తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో సరుకులు అందించేందుకు వీలుగా అమలు చేస్తున్న ఐటీ ప్రాజెక్టుల పనితీరు బాగుందని అసోం మంత్రి కితాబిచ్చారు.
ఇదీ చూడండి: 'ధిక్కరణ చర్యలు చేపట్టే అధికారం మాకు ఉంది'