ఐటీ గ్రిడ్స్ వ్యవహారంలో సైబరాబాద్ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో కీలకంగా మారిన అశోక్ కోసం గాలిస్తున్నారు. అతను చిక్కితేనే కేసులో పురోగతి ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. తాజాగా లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
అశోక్ కోసం 'లుక్ఔట్' - IT
ఐటీ గ్రిడ్స్ కేసు వ్యవహారంలో తెలంగాణ పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దర్యాప్తు అంతా సంస్థ సంచాలకుడు అశోక్ చుట్టే తిరుగుతోంది. అందుకే అతనిపై లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
అశోక్ కోసం 'లుక్ఔట్'
ఆంధ్ర ప్రజల వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటాబేస్ చోరీకి గురైందనే ఫిర్యాదు నేపథ్యంలో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రై. లిమిటెడ్’ సంస్థ సంచాలకుడు డాకవరం అశోక్‌పై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్నందున పోలీసులు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు.
ఇవీ చూడండి:తెరాస సన్నాహాలు షురూ