సమాజంలో అనునిత్యం ప్రజలకు సేవలు అందిస్తున్న అనేక రకాల సిబ్బందిని ఆదుకోవడానికి పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో అహర్నిశలు శ్రమిస్తున్న ఆశా వర్కర్లు, జీహెచ్ఎంసీ, పారిశుద్ధ్య, మలేరియా సిబ్బందిని ఆదుకోవాలని ఏఐటీయూసీ కార్యదర్శి అంజిరెడ్డి సూచించారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘం - ASHA SWEEPERS MALERIYA STAFF RICE Distribution in Hyderabad
విపత్కర పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తుండటం గొప్ప విషయమని ఏఐటీయూసీ కార్యదర్శి అంజిరెడ్డి పేర్కొన్నారు.
పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘం
ఈ తరుణంలో హైదరాబాద్ ముషీరాబాద్ బాకారంలోని ఓ అపార్ట్మెంట్ వాసులు ఆరు క్వింటాళ్ల బియ్యాన్ని వారికి అందజేశారు. ఆయా సిబ్బంది అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ అభినందించాలని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను అందరూ పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి:భారత్కు ఏడీబీ 220 కోట్ల డాలర్ల సాయం