తెలంగాణ శాసనసభ సమావేశాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారు. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. కరోనా నేపథ్యంలో కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు! - తెలంగాణ శాసనసభ
తెలంగాణ శాసన సభ స మావేశాల నిర్వహణ కోసం చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అసెంబ్లీ సిబ్బంది దృష్టి సారించారు. సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశ మందిరం, మీడియా, సందర్శకుల గ్యాలరీని పరిశీలించారు. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు కలిసి కూర్చునేలా సీటింగ్ ఉంది. కరోనా నేపథ్యంలో సభ్యులంతా విడివిడిగా కూర్చునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు.. శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు, అధికారులతో సమావేశమైన తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సభాపతితోనూ చర్చించాక చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చూడండి :పిల్లల అమ్మకాలకు ఏజెంట్ వ్యవస్థ.. 'సృష్టి'oచిన ఆసుపత్రి