తెలంగాణ

telangana

ETV Bharat / state

మేయర్​, డిప్యూటీ మేయర్​ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి - జీహెచ్​ఎంసీ ఎన్నిక ఏర్పాట్లు

జీహెచ్​ఎంసీ మేయర్​, డిప్యూటీ మేయర్​ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పార్థసారథి పరిశీలించారు. రేపు ఉదయం నూతన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నికల నిర్వహణ చేపట్టనున్నారు.

ghmc, mayor election
జీహెచ్​ఎంసీ, మేయర్​ ఎన్నిక

By

Published : Feb 10, 2021, 7:24 PM IST

జీహెచ్ఎంసీ కార్యాలయంలో గురువారం జరగనున్న గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పరిశీలించారు. కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించబోయే నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించిన సీటింగ్ ఏర్పాట్లు, అధికారుల నియామకం, బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.

గుర్తింపు పూర్తయితేనే

మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం నిర్వహించే ప్రత్యేక సమావేశాన్ని హైదరాబాద్ కలెక్టర్​, ప్రిసైడింగ్ అధికారి శ్వేత మహంతి నిర్వహించనున్నారు. ఎన్నికల పరిశీలకుడిగా సందీప్ సుల్తానియా వేదికపై నుంచి ప్రిసైడింగ్ అధికారితో పాటు సమావేశం జరుగుతున్న తీరును పరిశీలిస్తారు. సమావేశం సజావుగా జరిగేందుకు హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్నికైన సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులను మాత్రమే ఐడెంటిఫికేషన్ పూర్తయిన తర్వాత లోనికి అనుమతించనున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.

నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని, ప్రిసైడింగ్ అధికారి జారీ చేసిన నోటీసును వెంట తీసుకొని రావాలని అధికారులు ఆదేశించారు. ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:'వెనకబాటుకు కారణం మీరే... ఎందుకు పొలంబాట-పోరుబాట?'

ABOUT THE AUTHOR

...view details