చలి తీవ్రతను తట్టుకోలేక విధి నిర్వహణలో ఉన్న జవాను ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని విజయనగరం జిల్లా జామి మండలం పాతభీమసింగికి చెందిన పాండ్రంగి చంద్రరావు (42) 17 ఏళ్ల కిందట ఆర్మీలో చేరారు. ప్రస్తుతం లద్దాఖ్‌లోని 603-ఈఎంఈ బెటాలియన్‌లో నాయక్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం లద్దాఖ్‌కు 20 కి.మీ.ల దూరంలోని బింగాలక అనే మంచు ప్రాంతంలో విధి నిర్వహణలో ఉండగా, చలికి తట్టుకోలేక కుప్పకూలిపోయారు.
చలికి తట్టుకోలేక విధుల్లోనే జవాను మృతి
చలి తీవ్రతను తట్టుకోలేక విధి నిర్వహణలో ఉన్న ఓ జవాను ప్రాణాలు కోల్పోయాడు. లద్దాఖ్‌లో విధుల్లో ఉన్న ఏపీలోని విజయనగరం జిల్లా జామి మండలం పాత భీమసింగికి చెందిన జవాను... పాండ్రంగి చంద్రరావు కుప్పకూలిపోయాడు.
చలికి తట్టుకోలేక విధుల్లోనే జవాను మృతి
తోటి సిబ్బంది వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని రెండు రోజుల్లో భీమసింగికి తీసుకురానున్నారు. చంద్రరావు తల్లిదండ్రులు మరణించగా, భార్య సుధారాణి ఇద్దరి పిల్లలు విశాఖలో ఉంటున్నారు.
ఇదీ చదవండి:చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం కోసం క్రౌడ్ ఫండింగ్