భాజపాకు ప్రజలెప్పుడో సమాధి కట్టారు: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి - assembly session 2020
భాజపాకు ప్రజలు ఎప్పుడో సమాధి కట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. శాసనసభలో మాట్లాడేందుకు భాజపాకు సంఖ్యా బలమే లేదని ఎద్దేవా చేశారు.
భాజపాకు ప్రజలెప్పుడో సమాధి కట్టారు: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ మితిమీరి మాట్లాడుతున్నారని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్ ఆర్మూర్ జీవన్‌రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల్లో భాజపా బలం ఏంటో తేలిపోయిందని చెప్పారు. శాసనసభలో మాట్లాడేందుకు భాజపాకు సంఖ్యా బలమే లేదని ఎద్దేవా చేశారు. భాజపా అధ్యక్షుడైన సంజయ్... మొదట ఆయన ప్రణాళికేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
- ఇదీ చూడండి :సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం