హైదరాబాద్‌లో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు హైటెక్స్‌లో ఆక్వా అక్వేరియా ఇండియాను నిర్వహించనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మెరైన్ ప్రాడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఆథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. సచివాలయంలో మంత్రి సమక్షంలో ప్రభుత్వానికి, ఎంపీఈడీఏల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
'రాష్ట్రంలో నీలివిప్లవానికి నాంది పలుకుతాం'
రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగం అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మెరైన్ ప్రాడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ఆథారిటీకి మధ్య ఎంఓయూ కుదిరింది. హైదరాబాద్‌లో ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆక్వా అక్వేరియా ఇండియాను హైటెక్స్‌లో నిర్వహించనున్నారు.
తెలంగాణలో అక్వాకల్చర్ అభివృద్ధికి సహకరించడానికి ఎంపీఈడీఏ ముందుకు రావడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ఆక్వా అక్వేరియా ఇండియా విజయవంతం కావడానికి ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. జలవనరుల ద్వారా ఆక్వా ఎగుమతుల అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ఆక్వాకల్చర్ చేపట్టేలా రైతులను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఇవీచూడండి: నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా... భాజపాలోకి పోతానని అనలేదు