వినాయక చవితికి మార్కెట్లో పూలతో పాటు పండ్లకు కూడా గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంతో పండ్ల రేట్లు కొంచెం పెరుగుతుంటాయి. కానీ యాపిల్ పండ్ల పరిస్థితి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ప్రస్తుతం కిలో యాపిల్స్ ధర సాధారణం కంటే రూ.20 నుంచి రూ.30 వరకు తక్కువకే చిల్లర వర్తకులు విక్రయిస్తున్నారు.
భాగ్యనగరానికి యాపిల్స్ హిమాచల్ ప్రదేశ్ , జమ్ముకశ్మీర్ లాంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతుంటాయి. ఇటీవల ఉత్తరాదిలో భారీ వర్షాల ప్రభావం వల్ల... అక్కడి నుంచి యాపిల్స్ ఎగుమతి ఆగిపోయింది. ప్రస్తుతం పరిస్థితులన్ని చక్కబడ్డాక ఒకే సారి భారీ స్థాయిలో మార్కెట్లోకి యాపిల్స్ వచ్చాయి. దాని ప్రభావంతో ధరల తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.