తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇలా అయితే సీబీఐతో విచారణ జరిపించాల్సి వస్తుంది' - AP High Court latest news

పలు హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు కౌన్సిల్ చేసిన వాదనలపై ఉన్నత న్యాయస్థానం స్పందించింది. హెబియస్ కార్పస్ కేసులపై సీబీఐతో విచారణ చేయించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తాను వాదనలు వినిపించానని పోలీసుల తరఫు న్యాయవాది ఏపీ హైకోర్టుకు తెలిపారు. ఇలా అయితే సీబీఐ వాళ్లు ఏపీలో ఒక కార్యాలయం తెరవాల్సి వస్తుందని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

AP High Court Serious Comments on Police news
'ఇలా అయితే సీబీఐతో విచారణ జరిపించాల్సి వస్తుంది'

By

Published : Oct 9, 2020, 12:43 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కులను రక్షించలేకపోతే.. అది అప్రజాస్వామికం అవుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు పేర్కొంది. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై ఇవాళ జస్టిస్‌ రాకేష్‌కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవి ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్యాంగం ప్రకారం పోలీసులు నిర్భందించిన వ్యక్తిని 24 గంటల్లోపు న్యాయమూర్తి ముందు హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ.. చాలా కేసుల్లో అలా జరగడం లేదని... రోజుల తరబడి సామాన్యులను విచారణ పేరిట తమ నిర్భంధంలో ఉంచడం పోలీసులకు సాధారణమైన అలవాటుగా మారిపోయిందని వ్యాఖ్యానించింది.

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు దాఖలైన తర్వాత మూడు నాలుగు రోజులకు ఎఫ్​ఐఆర్​లు నమోదు చేస్తున్నారంటూ న్యాయవాదులు... ఏపీ హైకోర్టుకు వివరించారు. పోలీసుల తరపు కౌన్సిల్ చేసిన వాదనలపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇలా అయితే హెబియస్ కార్పస్ కేసు సీబీఐతో విచారణ చేయించాల్సి వస్తుందని... విజయవాడలో సీబీఐ తమ కార్యాలయం తెరవాల్సి వస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజ్యాంగ సూత్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తే ఎలా అని.. ప్రశ్నించింది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడలేకపోతే వారు ఎక్కడికి వెళ్లాలని హైకోర్టు నిలదీసింది. ఈ కేసును సోమవారానికి వాయిదా వేసిన ధర్మాసనం... ప్రభుత్వం వాయిదాలు తీసుకుంటూ త్వరగా విచారణ జరగకుండా చూస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది.

ABOUT THE AUTHOR

...view details