తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇళ్ల స్థలాల పంపిణీపై విచారణ.. స్టే ఇచ్చేందుకు నిరాకణ - ap news

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ఆరాష్ట్ర హైకోర్టు విచారించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు...తదుపరి విచారణను జనవరి 21కు వాయిదా వేసింది.

ఇళ్ల స్థలాల పంపిణీపై విచారణ.. స్టే ఇచ్చేందుకు నిరాకణ
ఇళ్ల స్థలాల పంపిణీపై విచారణ.. స్టే ఇచ్చేందుకు నిరాకణ

By

Published : Dec 25, 2020, 7:33 AM IST

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీని సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ఆరాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ... విచారణను జనవరి 21కి వాయిదా వేసింది. 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు దూర ప్రాంతాల్లో పట్టాలిస్తే... ఇంటికో ముగ్గురు చొప్పున కోటి మంది ఓటర్లు తరలిపోతారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ ప్రక్రియను వలస ఎందుకంటారని ప్రశ్నించిన ధర్మాసనం.... పునరావాసం కల్పించడంగా భావించవచ్చు కదా అని వ్యాఖ్యానించింది.

చిన్నచిన్న పనులు చేసుకొని బతికే వారికి దూరంగా ఇళ్ల స్థలాలిస్తే... జీవించే హక్కుపై ప్రభావం పడుతుందని న్యాయవాది అన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 25 వేల మంది ఓటర్లు మరో చోటుకి వెళితే.... ఓపెన్ నియోజకవర్గం రిజర్వ్ కావడం, రిజర్వ్ నియోజకవర్గం ఓపెన్ గా మారడం లాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. ఈ కారణంతో ఇళ్ల పథకంపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి :ఈ నెల 26, 27న ఎంబీబీఎస్​ తుది విడత వెబ్ ఆప్షన్లు

ABOUT THE AUTHOR

...view details