HIGH COURT ON RUSHIKONDA : ఆంధ్రప్రదేశ్లోని రుషికొండ తవ్వకాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు తామే కమిటీ వేస్తామని.. హైకోర్టు స్పష్టం చేసింది. రేపు విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని.. తెలిపింది. రుషికొండలో అనుమతికి మించి తవ్వకాలు జరుపుతున్నారంటూ.. దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రుషికొండ తవ్వకాలపై.. కేంద్ర ప్రభుత్వ అధికారులతో కమిటీ వేసి పరిశీలించాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది.
'రుషికొండ తవ్వకాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు కమిటీ వేస్తాం' - ap latest news
AP HIGH COURT ON RUSHIKONDA : ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న రుషికొండలో అనుమతికి మించి తవ్వకాలు జరుపుతున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. తవ్వకాలపై క్షేత్రస్థాయి పరిశీలనకు తామే కమిటీ వేస్తామని స్పష్టం చేసింది.
HIGH COURT
అయితే ఆ కమిటీలో ముగ్గురు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని నియమించడంపై.. పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. దీనిపై జోక్యం చేసుకున్న హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వంపైనే ఆరోపణలున్నప్పుడు.. ముగ్గురూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులనే కమిటీ సభ్యులుగా ఎలా వేస్తారని.. హైకోర్టు గత విచారణ సందర్భంగా అసహనం వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి పరిశీలనకు.. తామే కమిటీ నియమిస్తామని.. దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: