ఏపీలో మతసామరస్యం కాపాడేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. కమిటీల ఏర్పాటుకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు. కమిటీలు తరచూ సమావేశమవుతాయని తెలిపారు. రాష్ట్ర కమిటీలో సభ్యులుగా హోం, దేవాదాయ, మైనార్టీ సంక్షేమ శాఖల ముఖ్యకార్యదర్శులు ఉంటారని చెప్పారు. కమిటీలో సభ్యుడిగా సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారని వెల్లడించారు.
ఆలయాల ఘటనల వెనుక లోతైన కుట్ర: ఏపీ సీఎస్
ఆంధ్రప్రదేశ్లో మతసామరస్యం కాపాడేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కమిటీల ఏర్పాటుకు సంబంధించిన వివరాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ వెల్లడించారు. కమిటీలో సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శితో పాటు అన్ని మతాలకు చెందిన ఒక్కో ప్రతినిధి ఉంటారని వెల్లడించారు.
ఆలయాల ఘటనల వెనుక లోతైన కుట్ర: ఏపీ సీఎస్
'వరుస ఘటనల వెనుక లోతైన కుట్ర ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కమిటీలు రాష్ట్రంలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తాయి. కమిటీలకు ప్రస్తుతానికి ఎలాంటి కాలపరిమితి లేదు. ప్రజలకు భరోసా కల్పించేందుకే కమిటీలు ఏర్పాటు చేశాం. మతసామరస్యం కాపాడేందుకు అందరూ ముందుకురావాలి. మతసామరస్యం దెబ్బతీసేందుకు పథకం ప్రకారం కుట్రలు జరుగుతున్నాయి. నిందితులను పట్టుకునేందుకు పోలీసుశాఖ తనవంతు ప్రయత్నం చేస్తోంది' - ఆదిత్యనాథ్ దాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి