Krishna Water: తెలంగాణ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ఏపీ ప్రభుత్వం పిటిషన్ - నీటి వివాదం
11:46 July 14
మరోసారి సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కృష్ణాజలాల్లో చట్టబద్ధంగా తమకు రావాల్సిన వాటాను తెలంగాణ అడ్డుకుంటోందంటూ... పిటిషన్‌లో ఆరోపించింది. శ్రీశైలం ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది.
తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం చర్యలు రాజ్యాంగ విరుద్ధమని.... ఏపీ ప్రజల జీవించే హక్కు హరించటమేనని పేర్కొంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్ణయాలు అమలు కావడం లేదని ఆరోపించింది. కృష్ణానది యాజమాన్య బోర్డు.... కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయడం లేదని పిటిషన్‌లో వెల్లడించింది.