ఆంధ్రప్రదేశ్ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రహ్మణ్యాన్నిఆకస్మికంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పేరుతో ఈ ఆదేశాలు జారీ చేశారు.సుబ్రహ్మణ్యాన్నిబాపట్లలోని మానవవనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తక్షణం తన బాధ్యతలను సీసీఎల్ఏకు అప్పగించాలని ఆదేశించారు. మరో 5 నెలల సర్వీసు ఉండగానే ఎల్.వి.సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయటం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ - రాష్ట్ర సీఎస్ సుబ్రహ్మణ్యం బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. తక్షణమే తన బాధ్యతల నుంచి వైదొలగాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీ