హైదరాబాద్ తార్నాక డివిజన్ లాలాపేట్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో శనివారం నుంచి ఉచితంగా కరోనా (యాంటీజెన్ టెస్టులు) పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 24 మందికి పరీక్షలు చేయగా.. అందులో ఇద్దరికి కొవిడ్ పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు డాక్టర్ రాజశ్రీ తెలిపారు. ఇద్దరినీ హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించామన్నారు. వ్యాధి తీవ్రతను బట్టి వారిని ఎక్కడ ఉంచాలనేది నిర్ణయిస్తామని తెలిపారు. ఆక్సిజన్ అవసరమైన వారైతే గాంధీ ఆసుపత్రికి పంపిస్తామని, ఇంట్లో స్థలం లేకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలిస్తామని అన్నారు.
లాలాపేట్‌లో యాంటీజెన్ టెస్టులు ప్రారంభం
లాలాపేట్‌లోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో యాంటీజెన్ టెస్టులు ప్రారంభించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
లాలాపేట్‌లో యాంటీజెన్ టెస్టులు ప్రారంభం
ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని రాజశ్రీ తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సెకండరీ కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తులకు ముందుగా ప్రాధాన్యం ఇస్తామని, పరీక్షలు నిర్వహించిన అరగంటలోనే రిపోర్టులు అందజేస్తున్నామని వివరించారు. కేవలం లక్షణాలు ఉన్నవారు మాత్రమే కేంద్రానికి రావాలని సూచించారు.