ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మధుసుధన్రెడ్డిని అనిశా అధికారులు రెండో రోజు ప్రశ్నిస్తున్నారు. అనిశా న్యాయస్థానం ఆదేశం మేరకు రెండు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. మొదటిరోజు కేసుకు సంబంధించిన ప్రశ్నలను సంధించారు. అధికారులు సేకరించిన పలు ఆధారాలను మధూసూదన్ రెడ్డి ముందు ఉంచి వాటికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధుసూదన్ రెడ్డి కొనుగోలు చేసిన ఇళ్లు, వాహనాలు, భూములకు సంబంధించిన వివరాలను ఆయన నుంచి రాబట్టారు. కొనుగోలు చేసిన ధర కంటే తక్కువ మొత్తాన్ని లెక్కల్లో చూపించినట్లు గుర్తించిన అనిశా అధికారులు... అలా చేయడానికి గల కారణాలను మధుసూదన్ రెడ్డిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారనే దానికి సంబంధించి మధుసూదన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.
మధుసుధన్రెడ్డిని రెండో రోజు ప్రశ్నిస్తున్న అనిశా అధికారులు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డిని రెండో రోజు అనిశా అధికారులు ప్రశ్నిస్తున్నారు. మధుసూదన్ రెడ్డి ఆస్తులు ఎక్కడెక్కడ కూడబెట్టారనే దానిపై విచారిస్తున్నారు.
మధుసుధన్రెడ్డిని రెండో రోజు ప్రశ్నిస్తున్న అనిశా అధికారులు