తెలంగాణ

telangana

ETV Bharat / state

'నమో నారసింహా' నామస్మరణతో.. మార్మోగిన అంతర్వేది ఆలయం - antarvedi lakshmi narasimha swamy kalyanam

antarvedi kalyanam 2023 : ఆంధ్రప్రదేశ్​లోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం కమనీయం కన్నుల పండుగగా సాగింది. కళ్యాణ క్రతువులు, ఘట్టాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవిందా.. నమో నరసింహా.. నామస్మరణ మార్మోగింది. నరసింహుని పరిణయోత్సవం తిలకించి భక్తులు పులకించారు.

Lakshminarasimhaswamy Kalyan Mahotsavam
అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

By

Published : Feb 1, 2023, 9:16 AM IST

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

antarvedi kalyanam 2023 : నమో నారసింహా.. అంటూ అంతర్వేది మార్మోగింది. ఇక్కడ కొలువైన భూదేవీ, శ్రీదేవీ సమేత లక్ష్మీనరసింహుని కల్యాణం కనుల పండువగా సాగింది. ఆంధ్రప్రదేశ్​లోని అంతర్వేదిలో కొలువుదీరిన భూదేవి, శ్రీదేవి సమేత అంతర్వేది లక్ష్మీ నరసింహుని కళ్యాణ మహోత్సవం ఆద్యంతం వైభవోపేతంగా జరిగింది. ఎదురు సన్నాహంతో కల్యాణ క్రతువు ప్రారంభించారు. కల్యాణ మూర్తులను, ఉత్సవ మూర్తులను అర్చక స్వాములు వేదికపై ప్రతిష్ఠింపజేశారు.

antarvedi lakshmi narasimha swamy kalyanam : అనంతరం ఆభరణాలు మాంగళ వాయిద్యాల మధ్యకు తీసుకువచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన ఆలయ చైర్మన్ రాజా కలిదిండి రామగోపాల రాజాబహద్దూర్ సమక్షంలో పుణ్యాహవచనం, విష్వక్సేన పూజ నిర్వహించారు. కన్యాదాన క్రతువు శాస్త్రోక్తంగా జరిపారు. 12:46 గంటలకు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం రోహిణి నక్షత్ర యుక్త తులాలగ్నంలో శ్రీస్వామి, అమ్మవార్ల జీలకర్ర, బెల్లం పెట్టారు.

పాణిగ్రాహం , మాంగళ్యధారణ , తలంబ్రాల ఘట్టం కన్నుల పండువగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి విశ్వరూప్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వివిధ దేవాలయాలు, ప్రముఖులు మధుపర్కాలు , పట్టువస్త్రాలను కళ్యాణ మూర్తులకు సమర్పించారు. మంత్రులు వేణు గోపాలకృష్ణ , విశ్వరూప్, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్నతాధికారులు. నాయకులు కళ్యాణంలో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులుస్వామి కళ్యాణం తిలకించి పరవశించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details