తెలంగాణ

telangana

ETV Bharat / state

'మరో రెండు రోజుల తర్వాతే తెలంగాణలోకి నైరుతి' - నైరుతి రుతుపవనాలు తాజా వార్తలు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా అయిదారు డిగ్రీలు అదనంగా పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైరుతి రుతపవనాల రాకలో జాప్యం కారణంగా జూన్ రెండోవారంలోనూ ఇదే పరిస్థితి కొనసాగనుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

నైరుతి రుతపవనాలు
నైరుతి రుతపవనాలు

By

Published : Jun 11, 2022, 8:51 AM IST

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా పలు ప్రాంతాల్లో అయిదారు డిగ్రీలు అదనంగా పెరగడంతో అధిక వేడి, ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం కారణంగా జూన్‌ రెండోవారంలోనూ ఈ పరిస్థితి కొనసాగుతోందని వాతావరణశాఖ రాష్ట్ర అధికారి శ్రావణి చెప్పారు.

గత నెల 29న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తెలంగాణలోకి ఈ నెల 8కల్లా ప్రవేశిస్తాయని వాతావరణశాఖ తొలుత వేసిన అంచనాలు తప్పాయని.. మరో 2 రోజుల తర్వాత రావచ్చని అంచనా వేశారు . తెలంగాణకు రుతుపవనాలు రావాలంటే ముందుగా కర్ణాటక, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు పడాలి. కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయని, తెలంగాణలోనే అక్కడక్కడ చిరుజల్లులు, అసాధారణ ఎండలతో మిశ్రమ వాతావరణం ఉన్నట్లు శ్రావణి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details