Fake Certificate: నకిలీ పట్టాలతో కోట్లు కొల్లగొట్టేందుకు అక్రమార్కులు పక్కా పథకం వేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు తాజాగా మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. భోపాల్‌లోని ఎస్ఆర్కే విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ విజయ్ కుమార్‌ను పట్టుకుంటే ఈ వ్యవహారంలో కీలక ఆధారాలు లభిస్తాయని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. తమపై హైదరాబాద్‌లో కేసు నమోదైందని తెలుసుకున్న వర్సిటీ ముఖ్యులు డాక్టర్ సునీల్ కపూర్, ప్రొఫెసర్లు లడ్డా, గోపాల్‌పాండా, అసోసియేట్ ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
కొద్దినెలల క్రితం సంప్రదింపులు...
ఇంజినీరింగ్, డిగ్రీలు చదవకుండానే ఎస్ఆర్కే వర్సిటీలో చదువుకున్నట్టు ధ్రువపత్రాలు ఇస్తున్న కేతన్‌సింగ్ గుండేలా బృందం హైదరాబాద్‌తో పాటు వైజాగ్, విజయవాడ, బెంగళూరు, రాయచూరు ప్రాంతాల్లోని కన్సల్టెన్సీల యజమానులతో కొద్దినెలల క్రితం సంప్రదింపులు జరిపారు. ఇంజినీరింగ్ సర్టిఫికేట్లు కావాలన్నా, ఎమ్మెస్సీ, ఎంసీఏ పట్టాలు కావాలన్నా తమ వద్దకు విద్యార్థులను పంపితేచాలని, ఒక్కో విద్యార్థికి రూ. 50వేల నుంచి లక్ష వరకు కమీషన్ ఇస్తామనడంతో మొత్తం వివరాలను కేతన్‌సింగ్‌కు పంపించారు.
23 మంది అరెస్ట్...