తెలంగాణ

telangana

ETV Bharat / state

లంగర్​హౌస్​లో పరమేశ్వరునికి అన్నాభిషేకం - anointing with rice to lord shiva in hanuman temple

మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్​లోని లంగర్​హౌస్​ హనుమాన్​ దేవాలయంలో శివునికి అన్నంతో అభిషేకం చేశారు. 11 కిలోల బియ్యంతో అన్నం వండి అర్చకులు అభిషేకించారు.

anointing with rice to lord shiva in langer houz
లంగర్​హౌస్​లో పరమేశ్వరునికి అన్నంతో అభిషేకం

By

Published : Dec 30, 2020, 12:53 PM IST

మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం.. హైదరాబాద్​లోని లంగర్​హౌస్​ హనుమాన్​ దేవాలయంలో శివునికి అన్నంతో అభిషేకం నిర్వహించారు. పరమేశ్వరునికి రుద్రాభిషేకంతో పాటు 11 కిలోల బియ్యంతో అన్నం వండి చల్లార్చి అభిషేకించారు.

అర్చకుడు విశ్వనాథ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అభిషేకించిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా అందించారు.

ఇదీ చదవండి:యాదాద్రి ఆలయ కనుమ దారికి ఆధ్యాత్మిక హంగులు

ABOUT THE AUTHOR

...view details