తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రకాశం జిల్లా రైతు పొలంలో బయటపడ్డ ప్రాచీన సమాధులు - ancient tombs found at kudhru while while plowing the field

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రులో పొలం దున్నుతుండగా అతి ప్రాచీన సమాధులు బయట పడ్డాయి. ఓ చోట పొడవాటి బండ రాయి.. మరో సమాధిలో ఎముకలు, మట్టి కుండ అవశేషాలు కనిపించాయి.

ancient tombs found at kudhru while while plowing the field
ప్రకాశం జిల్లా రైతు పొలంలో బయటపడ్డ ప్రాచీన సమాధులు

By

Published : Jul 30, 2020, 2:16 PM IST

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని కుందుర్రులో అతి ప్రాచీన సమాధులు బయట పడ్డాయి. కుందుర్రు నుంచి నాగులవరం మార్గంలో బొగ్గులకొండ అంచుకు ఉన్న వ్యవసాయ భూమిలో రైతు యడ్లపల్లి మురళి భూమి దున్నుతుండగా ఇవి కనిపించాయి. ఓ చోట పొడవాటి బండ రాయి.. మరో సమాధిలో ఎముకలు, మట్టి కుండ అవశేషాలు లభించాయి.

ప్రకాశం జిల్లా రైతు పొలంలో బయటపడ్డ ప్రాచీన సమాధులు

సమాధులు క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం శిలాయుగం నాటివిగా అద్దంకికి చెందిన చారిత్రక పరిశోధకుడు జ్యోతి చంద్రమౌళి తెలిపారు. అప్పట్లో గిరిజన తెగలు నీటి సదుపాయం ఉన్న ప్రాంతంలో, సమీప కొండలపైన నివసించేవారని తెలిపారు. ఎముక పొడవును బట్టి అప్పటి వారు ఏడు అడుగుల భారీ కాయంతో ఉండేవారని పేర్కొన్నారు. తెగలో చనిపోయిన వారి మృతదేహాలను భారీ బండరాతి సమాధిలో కొండ అంచు భాగంలో భద్రపరిచేవారని ఆయన వివరించారు.

ఇదీ చదవండి: జాతీయ విద్యా విధానం-2020ని స్వాగతిస్తున్నా: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details