తెలంగాణ

telangana

ETV Bharat / state

జీహెచ్ఎంసీ అధికారులపై 11 ఏళ్ల బాలిక ఫిర్యాదు.. ఎందుకంటే.! - girl complained on GHMC officials

Girl Complained on GHMC Officials: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే.. ఎంతటివారైనా సరే ఉపేక్షించేది లేదు. మనకు న్యాయం జరిగే వరకు పోరాడాల్సిందే. ఇదే ఆ బాలిక నమ్మిన సూత్రమేమో.! అందుకే ప్రజల తరఫున బాధ్యత తీసుకుంటూ తమ కాలనీ సమస్యలపై దృష్టి సారించింది. ఆ సమస్యల గురించి పట్టించుకోని అధికారులపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలేం జరిగిందంటే..

Girl Complained on GHMC Officials
జీహెచ్​ఎంసీ అధికారులపై ఫిర్యాదు

By

Published : Mar 12, 2022, 4:44 PM IST

Girl Complained on GHMC Officials: రహదారి మరమ్మతుల గురించి పట్టించుకోని జీహెచ్ఎంసీ అధికారులపై కేసు నమోదు చేయాలని ఓ 11ఏళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. శేర్ లింగంపల్లి జోనల్ కమిషనర్​తో పాటు.. సర్కిల్ 20లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పైనా కేసు నమోదు చేయాలని శాహెర్ కౌర్ అనే 11 ఏళ్ల బాలిక ఫిర్యాదులో కోరింది. ఈ మేరకు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లికి ఫిర్యాదు చేసింది.

గతేడాది డిసెంబర్ 30 న రహదారి ప్రమాదాల నివారణ కోసం జరిగిన సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ, శేర్ లింగంపల్లి జీహెచ్ఎంసీ అధికారులకు పలు సూచనలు చేసినట్లు శాహెర్ కౌర్ ఫిర్యాదులో పేర్కొంది. రహదారిపై వాహనాల వేగం తగ్గించడంతో పాటు... ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలను ట్రాఫిక్ పోలీసులు సూచించారు. 4 నెలలు గడుస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి మరమ్మతులు చేయలేదని.. దీనివల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని శాహెర్ కౌర్ ఫిర్యాదులో వెల్లడించింది.

ఇదీ చదవండి:మార్కెట్ ధర ఇస్తేనే భూములిస్తం.. కాళేశ్వరం మూడో టీఎంసీ నిర్వాసితుల అల్టిమేటమ్

ABOUT THE AUTHOR

...view details