Amit Shah Telangana Tour Schedule 2023 : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తున్న అమిత్ షా.. ఈరోజు రాత్రి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు 11: 30కి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం అల్ఫాహారం అనంతరం 10: 30 గంటలకు సోమాజిగూడలోని కత్రియా హోటల్‌కు చేరుకుని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి ప్రసంగించనున్నారు.
అమిత్ షాకు తప్పిన పెను ప్రమాదం- ప్రచార రథానికి కరెంట్ షాక్, ర్యాలీ రద్దు చేసుకుని వెనక్కి
ఈ కార్యక్రమం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో గద్వాల్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 1: 20 గంటల వరకు గద్వాల, 2:45 నుంచి 3:20 గంటల వరకు నల్గొండ, సాయంత్రం 4:10 నుంచి 4:45 గంటల వరకు వరంగల్‌లో నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొననున్నారు. వరంగల్ పర్యటన ముగించుకుని బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్‌కు 6:10కు చేరుకుని 6: 45 వరకు విశ్రాంతి తీసుకోనున్నారు.
రాత్రి 7 గంటల నుంచి 7:45 గంటల వరకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్ నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఇటీవల హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మార్పీఎస్ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడంతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మార్పీఎస్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. క్లాసిక్ గార్డెన్‌లో సమావేశం ముగించుకుని అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 8: 15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.